కొబ్బరికాయ రోటి పచ్చడి/ Coconut chutney Andhra style

కొబ్బరికాయ రోటి పచ్చడి

coconut chutney

మనం పూజలకి ఎక్కువగా వాడుకుంటాం కదా కొబ్బరికాయని. వాటితో ఎంచక్కా బోలెడు రకాలు చేస్కొవచ్చు. రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్ధాలు:

కొబ్బరికాయ ఒకటి
ఎండుమిరపకాయలు 6
పచ్చిమిరపకాయలు 3
నాన బెట్టిన చింతపండు గోళికాయంత
ఉప్పు రుచికి సరిపడా
కరివేపాకు 2 రెమ్మలు
కొత్తిమీర 2 స్పూన్లు లేద ఒక చిన్న కట్ట
పోపు సామన్లు
నూనె/నెయ్యి ఒక స్పూను
రోలు లెదా మిక్సీ

Coconut chutney Andhra Style
Coconut chutney Andhra Style

తయారి విధానం:
ఎండుమిరపకాయల్ని, పచ్చిమిరపకాయలని అరచెంచా నూనెలొ వేయించి పక్కన పెట్టుకోవాలి.
కొబ్బరి ముక్కలుగా చెసుకొవాలి.

రోటిలో చేసే వారు ముందుగా చింతపండు, మిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా దంచుకోవాలి. ఆనక కొబ్బరిముక్కలు వేసుకుంటూ దంచుకోండి.కొన్ని కొన్ని గా వేసుంటుంటె కిందకి పడవు.
అన్ని మధ్య మధ్యలొ స్పూంతో బాగ కలుపుకుంటూ దంచుకోండి. మరీ మెత్తగ కన్నా కొంచెం కచ్చా పచ్చీగా వుంటేనే బాగుంటుంది. ఉప్పు వెసి చివరగా దంచుకోండి. దంచడం అయిపొయాక ఒక గిన్నెలొకి తీసుకుని పోపు వేసుకుని కొత్తిమీర వేసి కలుపుకుంటె వేడి వేడి అన్నం లోకి కమ్మగా ఉంటుంది.

మిక్సీ లో చేసేవారు ముందుగా మిరపకాయలు, చింతపండు, కొంచెం కొత్తిమీర వెసి ఒకసారి తిప్పాక కొబ్బరిముక్కలు ఉప్పు వేసి తిప్పుకోండి. ఆనక గిన్నెలోకి తీసుకుని పోపు వేసుకోవచ్చు.

Coconut chutney Telugu Style
Coconut chutney Telugu Style

Coconut is very good for hair and digestive system. It is also heart friendly and maintains healthy cholesterol levels.

Spicy Coconut Chutney-Andhra Style

Required:

Coconut pieces -1 cup

curry leaves -10

coriander 2 spoons

red chillies 6

green chillies 3

soaked tamarind-small ball

oil/ghee – 1 spoon

Andhra seasoning

Procedure:

Fry lightly red and green chillies in half spoon oil. In an Indian mortar, put red chillies , green chillies, little curry leaves, coriander, and tamarind and grind for five minutes. Later add coconut pieces and salt and grind for five more minutes. Mix with a spoon in between for better grinding. Take out in a bowl and put seasoning with oil or ghee. Serve with hot rice!!

Alternately, we can use electric mixer too. Initially grind chillies, tamarind, curry leaves and little coriander for half min. Later add salt and coconut pieces and grind for half more min. Take in a bowl and seasoning should  better be one with ghee for superb taste!

 

 

Advertisements

Published by

swethadhaara

Educator, blogger, mom, home maker, travel buff and a constant learner!!

Let me know how the recipe is!

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s