తెలుగు వారందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

Sankranti

Advertisements

చామదుంపల వేపుడు/ Spicy Colacasia fry

చామదుంపల వేపుడు

చామదుంపల వేపుడు ఇష్టపడని వారు తక్కువనె చెప్పాలి…కర కర  చామదుంపల వేపుడు యెలా చేయాలొ చూద్దాం.

colacasia fry
colacasia fry

కావల్సినవి:
చామదుంపలు పావు కిలో
నూనె 5 స్పూన్లు
ఉప్పు తగినంత
కారం రెండు చెంచాలు
వెల్లుల్లి 6 పాయలు

విధానం:
చామదుంపల్ని నీటిలో బాగ కడగాలి. ఒక గిన్నెలో నీరు తీసుకుని వాటిని వుడికించుకొవాలి. కుక్కర్లో ఐతే మరీ మెత్తగ అయిపొతాయి చూసుకోవాలి. మరీ మెత్తగా ఐతె బాగోదు. మూడు నిముషాల తరువాత ఒకసారి చూస్తు వుండండి. చేత్తోనో, చెంచాతోనో నొక్కితె కొoచెం లోపలికి వెల్తే చాలు.

వాటిని వేరే నీటిలోకి వెసుకుని తొక్క వొలిచి పక్కన పెట్టుకోండి. బానలిలో నూనె వేడి చేసి కొంచెం ఉప్పు వేయండి. అది చిటపటలాడాక చామదుంపలని కొన్ని కొన్ని గా వేస్తూ నూనె పట్టేలా కలుపుతూ వేయండి. అన్ని వేసేసాక మీడియం మంట పై వెయించండి. మూత పెట్టకండి.

నాలుగు నిముషాలు వేపాక ఉప్పు, కారం, దంచిన వెల్లుల్లి వేసి బాగ కలపండి. మల్లి రెండు నిముషాలు వెయించండి. మూత పెట్టద్దు. కలుపుతూ ఉండండి. కారం బాగ పట్టి వేగాక పొయ్యి కట్టేసి వేడి వేడిగా వడ్డించండి.

 

Stay in touch with us on FACEBOOK

Colacasia is one of the native crop of Indian subcontinent. Its roots and leaves are mainly used in many recipes all over India in various ways. Here’s an easy and spicy recipe with this root that goes well as starter and as a side dish with rice.

Required:

Colacasia roots: Quarter kilo

Oil 5 spoons

Salt to taste

Red chilly powder 2 spoons

Crushed raw Garlic 2 spoons

Procedure:

Select smaller and rounder ones for this recipe. Wash colacasia well. Boil them (not too smooth) to make them soft enough when you press with your finger. Preferably boil in an open pan without lid for five minutes.

Shift them into another bowl of normal water and peel them. Put them aside.

Heat oil in a pan, add little salt and wait for minute. Add slowly colacasia pieces and stir them well in the oil ensuring all the pieces are nicely coated.

Fry on medium heat for five minutes. Don’t put lid over the pan.

Add salt, chilly powder and crushed garlic and mix thoroughly.

Fry for two more minutes on little high flame.

Switch off the stove and serve hot as a starter or side dish for rice!

దోసకాయ టమాటో పచ్చడి/ Round cucumber and Tomato chutney

దోసకాయ టమాటో పచ్చడి

పుల్లపుల్లగా కారంకారంగా ఈ పచ్చడి చాలా బావుంటుంది.

dosatomatopachadi
dosatomatopachadi

కావలసినవి:

దోసకాయలు 2
టమాటాలు 2
పచ్చిమిర్చి 5
పోపు దినుసులు
నూనె 3 స్పూన్లు
కరివేపాకు రెండు రెమ్మలు
ఉప్పు ,కొత్తిమీర తగినంత

విధానం:
దోసకాయలు చెక్కు తీసి చేదు చూసుకుని ముక్కలు చేసుకోవాలి. పొయ్యి వెలిగించి బానలి లో రెండు స్పూన్లు నూనె వెసి అది వేడి అయ్యాక దోసకాయ ముక్కలు వెసి మూడు నిముషాలు వెయించుకోవాలి. మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు. అవి తీసేసి టొమటోలు,మిర్చి వేసి మూడు నిముషాలు వేయించండి. రోట్లొ ముందు దొసకాయ వేసి కచ్చ పచ్చిగా నూరాక టొమటోలు మిర్చి వేసి నూరుకోండి. ఆఖర్న కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వెసి నూరి గిన్నెలోకి తీసుకుని ఇంగువ వేసి పోపు వెయ్యండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తో తింటే అంతే అదిరిపొతుంది రుచి!

 

This recipe has an amazing tangy flavor of tomato and round cucumber and the spice of green chillies! A quick  8 minute recipe…

 

Required:

Round cucumber pieces 2 cups

Tomatoes 2 or 3 as per taste

Green chillies  5

Oil 3 spoons

Seasoning

Curry leaves handful

Coriander leaves 2 spoons

Procedure:

Heat two spoons oil in a pan, add cucumber pieces and fry for two/three minutes. Don’t make them too soft.

Remove them and in the same pan fry tomatoes and green chillies for two minutes. Tomatoes need not become too soft.

In a mortar, first crush cucumber pieces (roughly, not to a fine paste). Add tomatoes and green chilly s and crush further. Add salt, curry leaves and coriander leaves and crush for one more minute.

Take out into a serving bowl and do the tempering with asafoetida, chana dal, tur dal, cumin, curry leaves, and fenugreek. Serve hot with rice and ghee or rotis or as bread spread!

గోంగూర పప్పు/ Kenaf dal

గోంగూర పప్పు

మనకు గోంగూర చాల విరివిగా దొరుకుతుంది కదా. దానితో పప్పు చేసుకుంటే చాల పుల్ల పుల్లగా బావుంటుంది.

gongura pappu

కావలసినవి :
పాలకూర పప్పుకి మల్లే అన్ని అంతే
చింతపండు అవసరం లేదు

విధానం:
పాలకూర పప్పు లాగానె కాకపోతే గోంగుర వుడికించేప్పుడు పప్పు, ఆకు కలిపి పెట్టకూడదు. కుక్కర్లో ఆకు విడి గా వుడికించుకోవాలి. లేదా ఇలా కింద చూపినట్టు చిన్న గిన్నెలో వేసి పెట్టచ్చు .

gongura 1

మిగతా అంతా పాలకూర పప్పు లాగానే. పోపులో కొద్దిగా మెంతులు యెక్కువ వెసుకున్నా బావుంటుంది.

మనకు గోంగూర చాల విరివిగా దొరుకుతుంది కదా. దానితో పప్పు చేసుకుంటే చాల పుల్ల పుల్లగా బావుంటుంది.

Kenaf leaves are found in Andhra in abundance. They are rich in iron content. A healthy dal recipe with these leaves.

 

Ingredients and method is same as that of spinach dal. Here tamarind is not required. Also while cooking kenaf leaves, it should not be combined with dal. It has to be cooked separately or you can do as I have shown in the pic above. Put them in a separate cup and pressure cook them. Remaining procedure is same as that for spinach dal. Don’t forget to serve hot after tempering!

గోధుమ పుట్నాల పాయసం /Milk dips for children

ఇంతకు ముందు గోధుమ బిస్కట్లు తయారు చేయడం చూసారు కదా. వాటితో పిల్లలకి మంచి బలవర్ధకరమైన పాయసం చెయడం చుద్దాం.

milk dips
milk dips

కావలసినవి:
కాచిన పాలు ఒక గ్లాసు
పుట్నాలు ఒక కప్పు
పంచదార అర కప్పు
తురిమిన పచ్చి కొబ్బరి పావు కప్పు
గోధుమ బిస్కట్లు గుప్పెడు

విధానం:
పుట్నాలు, పంచదార, పచ్చి కొబ్బరి తురుము మూడింటిని కలిపి మిక్సీ లో వేసి పొడి చేసుకొండి. ఒక వెడల్పాటి గిన్నెలో మరిగిన పాలు తీసుకుని, ఈ పొడిని వేసి బాగ కలిపి మూడు నిముషాలు పొయ్యి మీద పెట్టి వుడికించండి. ఇష్టమున్న వాళ్ళు ఒక చెంచా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వెసుకోవచ్చు కూడా. ఇప్పుదు ఈ మిశ్రమాన్ని చల్లార్చి గోధుమ బిస్కట్లు వేసి కలిపి ఫ్రిజ్ లో పెట్టండి. చల్లరాక సెర్వ్ చెయ్యండి.

 

Here’s a different sweet recipe for kids and for special occasions!

Grind a cup of roasted dal, half cup sugar and half cup fresh grated coconut in a mixer. Keep aside.

Boil a big glass of milk in a pan. Add the above mixture and stir in and boil for three minutes. You may add a spoon of clarified butter and roasted dryfruits to enhance the flavor.

Switch off the flame. Let it cool. Add a handful of wheat cracklers to it. Mix well and put it in fridge. Serve chilled!

చిక్కుడుకాయ అల్లం కూర/ Broad beans curry

చిక్కుడుకాయ అల్లం కూర

చిక్కుడుకాయ అల్లం కూర
చిక్కుడుకాయ అల్లం కూర

గొంతు బాలేనపుడు, జ్వరం ఉన్నపుడు, నోరు చేదుగా అనిపించినపుడు చేస్కుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరొగ్యానికి యెంతో మంచిది కూడా!

కావలసినవి

చిక్కుడుకాయ ముక్కలు – 2 కప్పులు
పచ్చిమిర్చి నాలుగు దంచండి
తరిగిన అల్లం రెండు చెంచాలు
నూనె ఒక చెంచా
పోపు సామాను
కరివేపాకు రెండు రెమ్మలు
ఉప్పు తగినంత
పసుపు రెండు చిటికెళ్ళు

విధానం:
చిక్కుడుకాయలు కడిగి పురుగు లేకుండా చూసుకుని ముక్కలుగా తరుక్కోండి. కుక్కర్లో రెండు విజిల్స్ వరకు వుడికించుకొని నీరు వంపేసి పక్కన బెట్టండి.

బాండీలో నూనె వేసి పోపు వేసి, అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి నిముషం వేయించండి. తరువాత చిక్కుడుకాయ ముక్కలు వేసి కలిపి, మూత పెట్టండి, రెండు నిముషాల తరువాత పసుపు, ఉప్పు వేసి మరో నిముషం పాటు మూత లెకుండా వెయించండి. ఇష్టమైతే ఆఖరున కొబ్బరికోరు కూడా జల్లుకొవచ్చు.పొయ్యి కట్టేసి వేడి వేడి గా వడ్డించండి! కొంత మంది ఆఖర్న సెనగ పిండికూడా జల్లుకుంటారు. అలా ఐతె చివర్లో సెనగ పిండి జల్లి ఒక నిముషం పాటు వెయించి ఆపెయండి.

 

An excellent recipe when suffering from cold or fever or throat pain!

Required:

Cooked and drained Broad beans 2 cups

Chopped ginger two spoons

Green chillies 5 grind them

Salt to taste

Turmeric two pinches

Oil one spoon

Seasoning

Procedure:

In a pan, heat oil, put seasoning. Add choped ginger, chillies, curry leaves and fry for a minute. Add cooked and drained broad beans mix well and let it cook for two minutes. Add salt and turmeric and fry for a minute more. If desired,add grated coconut and /or besan and fry for a minute. Put off the flame and serve hot!

 

 

అరటిపండు అమృతం/ Banana delight- 5 minute healthy breakfast recipe

అరటిపండు అమృతం

పిల్లలు పొద్దున్నే టిఫిన్ తినట్లేదని బాధపడుతున్నారా? ఆఫీసుకి వెళ్ళే హడవుడిలొ మీకు టిఫిన్ చేసే టైం దొరకట్లేదా? ఈ అరటిపండు అమృతం చేస్కొని తాగెసేయండి. లంచ్ టైం వరకు కావలసిన శక్తి వస్తుంది. ఐదు నిముషాలలొ తయారు అయిపోతుంది కూడా.

banana delight
banana delight

కావలసినవి:
అరటిపండ్లు రెండు
తియ్యటి పెరుగు రెండు కప్పులు
తేనె 4 చెంచాలు
పంచదార 2 చెంచాలు
నీరు రెండు గ్లాసులు
ఇలాచి పొడి అర చెంచా

విధానం:
మిక్సీ లో నీరు తప్ప మిగతావన్ని వేసి బాగ కలిసే వరకు తిప్పండి. ఇప్పుడు నీరు పొసి మళ్ళీ తిప్పండి. గ్లాసుల్లోకి తీసుకుని అందివ్వండి. కావాలనుకుంటే పది నిముషాలు ఫ్రిడ్జ్ లో కూడా వుంచుకుని తాగవచ్చు. వొపిక ఉన్నవారు నానబెట్టిన బాదం పప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ కుడా వేసుకోవచ్చు. మంచి బలవర్ధకరమైన పానీయం ఇది! ఇది ఇద్దరికి సరిపొతుంది. ఇంకా యెక్కువ కావాలంటే తగిన విధంగా పాళ్ళు పెంచుకోండి!

 

A healthy and 5 minute breakfast recipe to boost your energy levels for the day ahead!

Required:

Bananas two

Whole Curd 2 cups

Honey 4 spoons

Sugar 2 spoons

Water 2 glasses

Cardamom powder half spoon

Method:

In a blender, blend all ingredients except water till very smooth. Add water and blend for a minute. Take in a serving glass and drink! You can also serve it chilled. Soaked almonds, raisins, cherries may also be added if desired. This portion serves two. Contains good protein and carbohydrates to start your day!

కారట్ పలావ్/ Carrot pulav- Lunch box recipe for kids

కారట్ పలావ్
పిల్లలకి మంచి లంచ్ బాక్స్ రెసిపి!

carrot pulav
carrot pulav

కావలసినవి:
తురిమిన కారట్ 2 కప్పులు
అరగంట నాన పెట్టిన బాస్మతి బియ్యం 1 కప్పు
నానబెట్టిన పచ్చి బటాణి ఒక కప్పు
బిర్యాని ఆకు, మొగ్గ, ఏలకులు,లవంగాలు,పువ్వు- అన్నీ రుచికి తగిననత
నీరు రెండు కప్పులు
ఉప్పు తగినంత
కొత్తిమీర కొద్దిగా
పసుపు చిటికెడు
నెయ్యి లేదా నూనె రెండు చెంచాలు

విధానం:

పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టండి. అందులో నూనె వేసి కాగాక మసాలా మొత్తం వేసి రెండు నిముషాలు వేయించండి. తరువాత నానబెట్టిన పచ్చి బటాణి ,తురిమిన కారట్, పసుపు వేసి రెండు నిముషాలు వేపండి. ఇప్పుదు నీరు పొసి కాగనివ్వండి. నీరు కాగాక నానబెట్టిన బాస్మతి బియ్యం
వేసి ఉప్పు వెసి కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టంది. మూడు విజిల్స్ వచ్చాక ఆపేసి చల్లరాక ప్లేట్ లోకి తీస్కుని కొత్తిమీరతో అలంకరించి వడ్డించండి.

 

A healthy and tasty recipe that suits well into lunch boxes!

Required:

Grated carrot- 2 cups

Basmati rice- 1 cup (soaked for half an hour)

Green peas – 1 cup (soaked for 10mins)

pulav masala

water 2 cups

Coriander for garnishing

Turmeric two pinches

salt as per taste

Olive oil or ghee 2 spoons

Procedure:

In a wide pan or cooker, add oil and let it heat. Add pulav masala and fry for 2 mins. Add grated carrot, peas and turmeric and fry for two mins.

Add water and let it boil. Add soaked basmati rice and salt. Mix well and pressure cook till 3 whistles. Let the cooker cool and take into a serving bowl and garnish with chopped coriander! Healthy carrot pulav is ready!

 

మసాలా మరమరాలు/ Spicy Puffed Rice- Best snack for weight loss

మసాలా మరమరాలు

ఇవి చాలా ఆరోగ్యకరమైన సాయంకాలపు ఫలహారం. అస్తమానం నూనెలో వేగినవి కాకుండా పిల్లలకి ఇలాంటివి తినిపించారంటే బలానికి బలం కూడా వస్తుంది.బరువు తగ్గాలి అనుకునె వారికి మంచి స్నాక్ ఇది!

masala borugulu
masala borugulu/low calorie crispy recipe

కావలసినవి:

మరమరాలు 2 కప్పులు
పల్లీలు అర కప్పు
పుట్నాలు అర కప్పు
కరివేపాకు 2 రెమ్మలు
వెల్లుల్లి 3 భాగాలు
ఎండుమిరపకాయలు 4
పసుపు అర చెంచా
ఉప్పు తగినంత
నూనె ఒక చెంచా
తయారీ విధానం

మూకుడులో నూనె వేడి చెయ్యాలి. అందులో ముందు పల్లీలు వేసి అవి రంగు మారెంతవరకు వేయించాలి. తరువాత కరివేపాకు, దంచిన వెల్లుల్లి, పుట్నాలు, పసుపు, ఎండుమిర్చి వెసి రెండు నిమిషాల పాటు వేయించాలి.నచ్చిన వాళ్ళు ఇంగువ కుడా వెసుకొవచ్చు.మంచి వాసన వస్తుంది. పొయ్యి ఆపేసి పెద్ద గిన్నెలొకి వీటిని తీసుకుని మరమరాలు కూడ వేసి అన్ని బాగ కలిసేలా ఉప్పు జల్లి బాగా కలపాలి. గాలి జొరబడని డబ్బా లో పొసుకుంటే వారం పాటు కరకరలాడుతూ కారం కారం గా బావుంటాయి!

 

Best alternative for chips and rich in iron and protein!

Required:

Puffed rice 2 cups

Peanuts half cup

Roasted chana dal half cup

Turmeric half spoon

Salt to taste

Oil one spoon

Curry leaves

Red chillies 3

Procedure:

In a pan, heat the oil and fry peanuts till they change the color. Later add all other ingredients except puffed rice and fry for two minutes on low flame. Switch off the flame and in a bowl, transfer the fried contents and add puffed rice. Sprinkle required salt and mix thoroughly. Store in an air tight container. They stay fresh and crispy for a week. Enjoy with tea in the evening!

చపాతీలు/ Indian rotis

చపాతీలు

చపాతీలు చేయడం కష్టమని కొంతమంది అభిప్రాయం. అందుకె బయట నుండి కొనుక్కుంటూ ఉంటారు లెదా కేవలం సమయం ఉన్నప్పుడే చెసుకుంటారు. కొంచెం అలవాటు ఐతే చేస్కోవడం పెద్ద శ్రమ అనిపించదు.

కావలసినవి:
గోధుమపిండి రెండు కప్పులు
నీరు ఒక గ్లాసు

Indian rotis Chaapatilu
Indian rotis Chaapatilu

విధానం:
కలపటానికి వీలుగా ఉండేలా ఒక పెద్ద గిన్నెలొ పిండి వేసుకోవాలి. కొద్ది కొద్ది గా నీరు పోసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. కొత్తగా చేసేవారు కొంచెం కొంచెం నీరు పోస్కొవడం ఉత్తమం. లేదంటె గుజ్జు అయిపొవచ్చు. కొచెం గట్టిగా నె కలిపి చేత్తొ బాగా ముద్దలా చెయ్యాలి. ఈ ముద్దని ఒక గంట పక్కన పెత్తి పైన ఒక మూత లేదా తడి బట్ట కప్పి ఉంచితే ఎండిపోకుండా ఉంటుంది.

తర్వాత పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన ఉంచుకొవాలి. చపాతి పీటపై కొంచెం గొధుమపిండి జల్లి ఒక ముద్దని తీసుకుని చపాతి కర్రతో గుండ్రంగా వొత్తుకొవాలి. అత్తుక్కుంటోంది అనిపిన్స్తే కొంచెం గొధుమ పిండి జల్లుకోండి. ఇలా కొంచెం వొత్తి మళ్ళీ దాన్ని మరో వైపు తిప్పి వొత్తుకొవాలి. ఇలా మనకు కవలసినంత పల్చగా వొత్తుకొవాలి.మరీ పల్చగా ఐతే చినిగిపొతాయి.

పొయ్యి వెలిగించి పెనం పెట్టి, పెనం వేడి అయ్యాక, చపాతి వేసుకొని కల్చాలి. లోపలి గాలి వేడి అయ్యి చపాతి కొంచెం పొంగుతుంది అప్పుడు మరొ వైపుకి తిప్పి కాల్చుకొవాలి. అల రెండు వైపులా కాల్చుకొని యెదైన కూర లేదా పప్పు తో తినవచ్చు.

 

నూనెలేకుండా చేసిన వాటినె పుల్కాలు అంటారు. నూనె వేస్తే చపాతినే!
సూచన:
1. కొంత మంది పిండి కలిపేటప్పుడు ఉప్పు వేసుకుంటారు. కావాలంటె వేసుకొవచ్చు.
2. పిండి కలిపేటప్పుడు అర కప్పు గోరువెచ్చని పాలు పోస్తె మెత్తగ వస్తాయి. అప్పుడు ఆ వారా నీరు తగ్గించండి.
3. కావలనుకునే వారు నూనె లెదా నెయ్యి వెసి కాల్చుకొవచ్చు. ఆలివ్ లేదా సంఫ్లవర్ నూనె బావుంటాయి.

Indian Rotis:

  • Whole wheat flour 2 cups
  • Water 1 cup

 

Take flour in a big bowl. Keep adding little water and make it like a medium hard ball. Knead well, cover with a lid or wet cloth. Keep it aside for one hour.

Make small balls out of it. Spread flour on a bread board or kitchen platform and put a ball on it and roll it in a circular fashion. Turn it onto another side and spread little more powder, if required and roll it more.

Heat a pan and put this roti onto it . The air inside the roti makes it to bulge little,at this time roll it over to the other side and heat it.

When it is done, serve hot with daal or any curry.

Tip:

1. If desired, one may even add salt while adding water.

2. Half cup warm milk can also be added to get softer rotis. Cut down water ratio proportionally.

3. Rotis taste better when made with ghee or sunflower oil or olive oil.

Don’t forget to serve hot!!

వెజిటబుల్ జ్యూస్/ Veggie juice for stronger hair

వెజిటబుల్ జ్యూస్

detox

కావల్సినవి:
కారట్ ముక్కలు ఒక కప్పు
బీట్రూట్ ముక్కలు ఒక కప్పు
కొత్తిమీర తరుగు 2 స్పూన్స్
కరివేపాకు 2 రెమ్మలు
ఉసిరికాయ ముక్కలు చెంచా

టొమాటో ఒకటి

పుదీనా ఆకులు 3 స్పూన్లు
దాల్చినచెక్క పొడి అర చెంచా
నీరు రెండు గ్లాసులు

విధానం:
నీరు తప్ప మిగతా అన్నిటినీ మిక్సీ లొ వేసి రెందు నిమిషాల పాటు తిప్పండి. ఇప్పుడు నీరు కూడా పోసి మరో మూడు నిముషాలు తిప్పండి. వడకట్టి గ్లాసులోకి పోసుకుని ఫ్రెష్ గా ఉన్నపుడే తాగెసెయండి!

 

Quick detox juice to cleanse your body from within!

Required:

Beetroot pieces one cup

Carrot pieces  one cup

Tomato one

Curry leaves 10

Mint leaves – 1 cup

Coriander chopped 3 spoons

Cinnamon powder half spoon

Indian Gooseberry pieces 1 spoon

Water 2 glasses

How to do:

Except water, put all other in a blender and blend for two minutes. Add water and blend for two more minutes. Filter it and serve fresh in a serving glass!

Amla or the Indian Gooseberry is very good for hair and helps in maitaining hair roots strong and retains hair color. Same is with curry leaves!

టమాట రోటి పచ్చడి/5-minute Tomato Chutney recipe

టమాట రోటి పచ్చడి

tomatochutney
tomatochutney

ఐదు నిముషాల్లొ అయిపొయె పచ్చడి ఇది. అదిరిపొయే రుచి కూడా!

కావలసినవి:
టమాటాలు ఆరు
పచ్చిమిరపకాయలు నాలుగు
నూనె ఒక స్పూను
ఉప్పు తగినంత
కొత్తిమీర చిన్న కట్ట
కరివేపాకు మూడు రెబ్బలు

పద్ధతి:

బానలిలొ నూనె వెసి టమాటాలను, మిరపకాయలను 3 నిముషాలు మూత పెట్టకుందా వెయించాలి.

టమాట తొక్క వచ్చేస్తుంది. దాన్ని పట్టకారతో తీసేసేయాలి.
రోటిలొ ముందు సగం కొత్తిమీర, రెండు రెమ్మలు కరివేపాకు నూరుకోవాలి. తరువాత టమాటా ముక్కలు, మిరపకాయలు వెసి మెల్లగా నూరుకోవాలి. ఆఖరున ఉప్పు కలిపి నూరి, గిన్నెలోకి తీసుకుని పోపు వెయ్యండి. మిగతా కొత్తిమీర తరిగి పైన అలంకరించండి. కారంగా పుల్లగా నోరూరించే టమాట పచ్చడి 5 నిముషాల్లొ సిద్ధం!

 

This recipe is very easily made and tastes awesome with the flavor of tomato and green chillies..you can use it as a dip for breads, puffs or with any other bread varieties!

  • 6 tomatoes(take small red juicy ones, don’t go for hybrid variety)
  • 4 green chillies
  • One spoon oil
  • salt to taste
  • Curry leaves handful
  • Coriander three spoons

Put oil in the pan. Fry tomatoes and chillies together for 3 minutes.

When the peel of tomatoes crack, remove them.Put off the flame.

Grind some curry leaves and little coriander first in a mixer.

Later add tomatoes and green chillies and salt and grind for quarter minute.

Take in a serving bowl and season it and garnish with coriander leaves.

Hot, spicy red tomato chutney is ready in five minutes!

Serve with hot rice or dosa or chapati or toasted bread or use as a pizza base coat!

పాలకూర పప్పు/Healthy Spinach dal

పాలకూర పప్పు

pala

పాలకూర ఆరోగ్యానికి యెంత మంచిదో మనందరికి తెలుసు కదండీ…సులువుగా కమ్మగా అయిపొయే పప్పు యెలా చెయాలో చూద్దాం

కావలసినవి:

పాలకూర 3 కట్టలు
కందిపప్పు ఒక కప్పు
ఉల్లిపాయ ఒకటి
చింతపండు రసం 3 స్పూన్లు
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
పచ్చిమిరపకాయలు 3
పోపు సామాన్లు
నూనె ఒక చెంచా

పద్ధతి:

కందిపప్పు కడిగి పావుగంట పాటు ఒకటిన్నర గ్లాసు మంచినీటిలొ నానబెట్టుకోవాలి. ఈలోగా పాలకుర శుభ్రంగా కడిగి ఆకులు తరుక్కోవాలి.
ఉల్లిపాయ నాలుగు భాగాలు చెసుకొండి. మిరపకాయలు నిలువున చీర్చుకోండి.

ఒక వెడల్పాటి గిన్నెలొ నానబెట్టిన కందిపప్పు నీటితొ సహా వేసి, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ్ ముక్కలు, పాలకూర తురుము వెయ్యండి.

కుక్కర్ అడుగున రెండు గ్లాసులు నీళ్ళు పొసి చిల్లుల ప్లేటు పెట్టి ఈ పప్పు గిన్న పెట్టి కుక్కర్ మూత పెత్తి విజిల్ పెట్టి పొయ్యి వెలిగించండి.

నాలుగు విజిల్స్ వచాక పొయ్యి ఆపేయండి.7 నిమిషాల తర్వాత కుక్కర్ చల్లబడ్డాక మూత తెరిచి పట్టకారతో గిన్నె బయటకి తీయండి. పప్పు,ఆకు, ఉల్లిపాయ, మిరపకాయ అన్ని కలిసెల మెత్త మెదపండి.

ఒక బానలిలో లొ పోపు వెసుకుని, గరిటెతో కొద్ది కొద్ది గా పప్పు వెస్తూ కలపండి. మొత్తం పప్పు వేసేసాక ఉప్పు, పసుపు,చింతపండు రసం వేసి బాగ కలిపి మూడు నిముషాలు పొయ్యి మీద ఉంచి దించేయండి. కమ్మని పాలకుర పప్పు సిద్ధం! వేడి అన్నంలొకి నెయ్యి వెసి వడ్డించండి.

Follow us @ facebook

——————–

Spinach is a good source of plant protein besides being loaded with other vitamins. The best way to consume it without losing any nutrients is by taking in boiled form. Here’s one such recipe.

Required:

Cleaned, chopped spinach – 2 cups

Yellow lentils (soak for 15mins)- 1 cup

Salt to taste

Onion (cut into 4 parts)-1

Sliced green chillies – 3

Tamarind juice- 1/4th cup

Water 2 cups

Procedure:

In a wide bowl, add soaked yellow lentils, chopped spinach, onion pieces and green chilly slices. Pour water and pressure cook this till 4 whistles.

After cooker cools, take out the bowl, mash the contents well. In a pan , do seasoning, slowly add dal using a ladle. Add salt to taste, pinch of turmeric, tamarind juice mix well. Keep on flame for three minutes. Add little ghee/clarified butter while serving. Serve hot with roasted bread or brown rice or rotis!

 

Follow us @ facebook

——————–

 

పోపు ఆరోగ్య రహస్యం మరియు మెళకువలు Secrets of Tempering the Andhra way!

telugu vantillu
పోపు ఆరోగ్య రహస్యం మరియు మెళకువలు

మన తెలుగు వంటలకి పోపు తప్పనిసరి. ఈ మధ్య కొంతమంది నూనె తగ్గిద్దాం అని పొపు వెయ్యట్లెదు చారుల్లో కూరల్లో పప్పులో వగైరా…

మన పెద్ద వాళ్ళు చెప్పినదాంత్లొ ఎన్నొ అరోగ్య సూత్రాలు ఉంటాయి కదండి. మరి అవేంటొ తెల్సుకుందామా
సాధారణంగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, పచ్చి సెనగ పప్పు, మినపప్పు, ఇంగువ ఉంటయి మన పోపుల పెట్టెలో . వీటిని వాడటం వలన మనకు జీర్ణ ప్రక్రియ మెరుగుపడి మన జీవక్రియ(మెటబొలిక్ రేట్) వెగవంతమవుతుంది. దాంతో మనం త్వరగా బరువు తగ్గే ఆస్కారం ఉంటుంది.

మీరు బరువు తగ్గాలి అనుకుంటె నూనె మీకు ఇబ్బంది ఐతే నూనె మార్చి చూడండి. పొపుకి కొబ్బరి నూనె లెదా ఒలివ్ నూనె వాడండి దాంతొ మీరు త్వరగా బరువు కూడా తగ్గుతారు. చెడు కొలెస్ట్రొల్ కూడా అదుపులొ ఉంటుంది.కొబ్బరినూనే అని భయపడకండి ఒక్క సారి వేసి చూడండి ఆ వాసన ఎంత కమ్మగా వుంటుందో!

ఏమంటారు ఎంతైనా పొపు వెస్తేనె కదా ఆ సువసనా ఆ రుచి !!

పోపు వేసేటప్పుదు ముందు ఆవాలు వెయ్యాలి. ఆవాలకి యెడు పొరలుంటాయి అంతారు. అందుకే ముందు ఆవాలు వెసి అవి చిటపటలాడాక జీలకర్ర, పచ్చి సెనగపప్పు, మెంతులు వెయాలి. అవి చిటపటలడాక పొయ్యి కట్టెసి కరివెపాకు ఇంగువ వెయ్యండి. అప్పుదు చూడండి యెంత కమ్మగా వాసన వస్తుందొ!

ఈ సారి పొపు వెసెటప్పుదు ఈ మెళకువలు గుర్తుంచుకుంటారు కదూ!

Follow us on facebook

Traditional south Indian style of seasoning contains heating oil(generally sunflower or ground nut oil) and adding spices like mustard, cumin, fenugreek along with some cereals like chana dal and tur dal. Some people love to add asafoetida and curry leaves too..

All these spices increase the metabolic rate and helps in losing fat faster. If one is concerned about oil used, they may also switch to coconut oil or olive oil for seasoning which are health friendly. In any means, adding seasoning gives special flavor and smell to any south Indian recipe!

Beetroot coconut burfi

దీపావళి ప్రత్యేకం

పండగపూట బయటి నుండి మిథాయిలు తెచ్చుకొవడం సులువే, ఐతే మన ఇంట్లొ చెసుకున్నంత కమ్మగా అరొగ్యకరం గా ఉందవు కదా ఏమంటారు.., పైగా కుటుంబ సభ్యులందరు కల్సి చేస్కుంటె ఆ పండగ పూట అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. తేలికైన మిథాయి చేస్కొవడం ఎలాగో చెప్తున్నా చదవండి..

బీట్రూట్ కొబ్బరి బర్ఫి

బీట్రూట్ తురుము రెండు కప్పులు
పచ్చ్హి కొబ్బరి తురుము ఒక కప్పు
పంచదార ఒక కప్పు
నెయ్యి అర కప్పు
జీడిపప్పు రెండు చెంచాలు(నేతిలొ వేయించినవి)

తయారీ విధానం:

ముందుగా బాణళి లో కొద్దిగా నెయ్యి వెసి బీట్రూట్ తురుము మరియు పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. మంట తక్కువలొ వుంచుకుంటె కమ్మగా వస్తుంది. లేదంటె మాడిపొయే ప్రమాదం ఉంది. కాసెపటికి కమ్మని వాసన వస్తుందనంగా పంచదార వెసి బాగా కలపండి. పంచదార కరిగి మొత్తం తురుముతొ బాగా కలుస్తుంది. మధ్యలొ కలియబెడుతూ వుండండి. మూడు నిముషాలు అయ్యాక మిగిలిన నెయ్యి మొత్తం వెసేసి బాగ కలబెట్టండి.తురుము మరియు పంచదార మిశ్రమం బాగ వేగుతాయి నేతిలో. కాసేపటికి నెయ్యి బయటికి వచేస్తుంది. అప్పుడు ఆపి దింపేయంది. కావాలి అనుకున్న వారు కొద్దిగా యాలకుల పొడి జల్లుకొవచ్చు.నేతిలొ వేయించిన జీడిపప్పు ఉన్నాయి కదా వాటిని కలిపెయండి. ఇది వేడి వేడి గా నైనా తినచ్చు. లేదా చల్లగా నైన తినచ్చు. మొత్తం పావుగంత కూడ పట్టదు చెస్కొవడానికి!! ఫ్రిజ్ లో పెట్టుకుంటె 5 రోజులు నిలవ వుంటుంది.

Beetroot- coconut burfi:

Required:

Grated beetroot two cups

Grated fresh coconut one cup

Sugar one cup

Ghee half cup

Ghee fried cashew nuts and or pista

Procedure:

In a pan, add two spoons of ghee and fry the grated beetroot and coconut together for 5 mins. When you get the fried smell, add sugar and mix thoroughly. The sugar melts and mixes thoroughly with the grated mixture. After 5 minutes, add the ghee and keep stirring occasionally. Elachi powder may also be sprinkled to get the nice aroma.Once the ghee starts coming out of the mixture, put off the flame, add ghee fried cashews and or pista. Serve hot or cold. This burfi will stay for 5 days when kept in fridge.

 

Join us @facebook