పాల విరుగుడుతో గులాబ్ జామూన్/ Paneer Gulab Jamun

పాల విరుగుడుతో గులాబ్ జామూన్

పాలు విరిగిపోయినపుడు ఈసారి గులాబ్ జామున్ చేసి చూడండి. మంచి ప్రొటీన్ కదా.

Paneer Gulab Jamun
Paneer Gulab Jamun

కావల్సినవి:

పాల విరుగుడు/ పనీర్ తురుము 1 కప్పు
పంచదార ఒక కప్పు
నీరు ఒక కప్పు
మైదా పిండి ఒక స్పూను
పేరు నెయ్యి అర చెంచా
నూనె ఒక కప్పు
పచ్చ కర్పూరం చిటికెడు
ఇలాచి ఒకటి

తయారి పద్ధతి:
పాలు విరిగిపోయి ఉంటె సరే, లేక పోతె పాలు కాచేటప్పుడు మూదు చుక్కల నిమ్మరసం వేయండి. విరుగుతాయి.అలా విరిగిన పాలని ఒక సూప్ జల్లెడలో తీసుకుని మొత్తం నీరంతా పొయేలా వడకట్టండి. కేవలం పనీర్ మటుకే మిగలాలి. నీరుంటే గులాబ్ జాం చుట్టడానికి కుదరదు. మరీ మీకు సందేహముంటే విరుగుడుని ఒక గిన్నెలో తీసుకుని పొయ్యి మీద మధ్యస్థంగా మంట పెట్టి ఐదు నిముషాలు తిప్పుతూ వుండండి. నీరు ఆవిరి అయిపోతుంది. అల మిగిలిందే పన్నీర్ అన్న మాట. అదే రెడీమేడ్ గా దొరికిన పన్నెర్ ఐతె ఇదెమి అవసరం లెదు. దాన్ని తురుముకోండి చాలు.

అలా మిగిలిన పాలవిరిగుడు/పనీర్/ పనీర్ తురుము లో పేరు నెయ్యి, మైదా పింది వేసి బాగ ముద్ద లాగ అయ్యెలా పిసకండి.మూత పెట్టి పక్కన ఉంచండి.

పొయ్యి పై ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులో పంచదార వేసి, నీరు పోసి బాగ కలిపి, పొయ్యి వెలిగించి లేత పాకం వచ్చెవరకు వుంచండి. పాకం కట్టాక పచ్చ కర్పూరం, ఇలాచి దంచి అందులో వేసి కలిపి పక్కన వుంచండి.

ఇప్పుడు పన్నీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలుగా (గులబ్ జాం సైజు మీకెంత కావాలో అంత) చేయండి. పొయ్యి వెలిగించి బానలిలో నూనె పోసి వేడి అయ్యాక ఈ వుండలని వేసి వేయించండి.మరీ యెక్కువ మంట పై వేయిస్తే మాడిపోతాయి, చిన్న మంట వుంచండి, నూనె మరీ పొగలు రావల్సిన అవసరం లేదు. కొద్దిగా వేడి ఐతె చాలు. అన్ని జాములను గొధుమ రంగు వరకు వేయించి పక్క ఉంచుంకోంది. చల్లారనివ్వండి.

ఇప్పుడు జామున్లను పాకం లో వేసెయండి. ఒక గంట అయ్యక వూరి బావుంటాయి. ఇంక రాత్రంతా ఫ్రిజ్లో ఉంచి మరునాడు వడ్డిస్తే చాలా బావుంటాయి!

Paneer Gulab Jamun

Required:

Paneer 1 cup grated

Sugar One cup

Water one cup

Unmelted ghee at room temperature half spoon

Elachi 1

Maida/ Refined flour one spoon

Procedure:

Grate panner, mix maida and ghee and mash well with hand . Make into a smooth paste.

In a bowl, dissolve sugar in water and make a syrup of medium thickness.

In a kadai, heat oil and let it heat on low flame. Meanwhile make small balls of desired size  out of paneer mixture. Fry them till golden brown in the oil. Let them cool.

Add these jaamuns to syrup and serve chilled after 6 hours for better taste.

Notes:

1. To make home made paneer, add three drops of lemon juice to boiling milk and let it curdle.  Strain all the water and ensure only the panneer part remains without any water. If you want to make sure there is no water in that paneer, take that panneer in a pan and put on medium flame and keep stirring for 5 minutes. All water evaporates leaving only the solid part.

2. Don’t overheat oil to fry jamuns, they may turn black. Don’t over fry them too.

3. You can replace maida with wheat flour too.

Advertisements