బ్రెడ్ ఆంలెట్/ Bread Omelette

బ్రెడ్ ఆంలెట్

పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానె యెమి చెయ్యలో తోచట్లెదా? పొద్దున్నె ఆఫీసు కెళ్ళే హడావిడిలో తిఫ్ఫిన్ ఏం చేయాలో తెలీయట్లేదా? చక చకా అయిపొయే ఐటంస్ కోసం వెతుకుతున్నారా? హేల్థీ మరియు త్వరగా అయిపోయె వంటల్లో ముందుంటుంది ఈ బ్రెడ్ ఆంలెట్.

కావలసినవి:
బ్రెడ్ స్లైసు ఒకటి
కోడిగుడ్డు ఒకటి
ఉప్పు కారం తగినంత
నూనె సగం చెంచా

bread omlette
bread omelette

విధానం:
బ్రెడ్ ముందుగా పది సెకన్లు పెనం మీద వేడి చెయ్యండి. అదే పాన్ పై పావు చెంచా నూనె రాయండి. కోడిగుడ్డు పగుల కొట్టి వేయండి. దానిపై ఉప్పు కారం జల్లండి. అది కొద్దిగా కాలాక బ్రెడ్ వేసి అదమండి.దాని పై మరొ పావు చెంచా నూనె వేయండి. మరి కొంచెం కాలాక మరో వైపుకి తిప్పి కాల్చండి. బ్రెడ్ కొద్దిగా గొధుమ రంగులోకి రాగనె పొయ్యి ఆపెయండి.

ఇది తిఫిన్ కి, లంచ్ కి, సాయంత్రం స్నాక్ కి, రాత్రి లైట్ గా తినాలి అనుకునేవారికి మంచి ఆప్షన్.

సూచన:
1. మీరు డైయాబెటిక్ ఐనా, బరువు తగ్గాలి అనుకున్న బ్రౌన్ బ్రెడ్ వాడుకోండి.
2. ఆలివ్ నూనె వేసుకోండి.
3. పిల్లలకోసం ఐతె కాల్చుకోవడానికి వెన్న వాడండి.
4. సమయం ఉంటే కారట్ తురుము, పుదీనా, కొత్తిమీర తో అలకరించుకొవచ్చు.

Bread omelette is an easy, super quick and healthy recipe for those who run out of time to prepare breakfast. It goes well for break fast, lunch box, evening snack and dinner.

Ingredients:

Bread slice 1 (go for brown bread if you are health conscious or diabetic)

Oil half spoon (Choose olive oil if you want to lose weight or better health, choose butter if you are making for children)

Salt and red chilly powder to taste

Whole egg 1 (you can even skip yellow if you have cholesterol problem)

Procedure:

On a pan, heat bread for ten seconds. Apply 1/4 spoon oil to the pan and beat an egg and spread it over. Dash salt and chilly powder according to your taste. Let the omelette roast a little.

Now put bread over the half raw omelette and press it slightly. Apply the other 1/4 spoon of oil to the bread. Wait till omelette is roasted on one side and then turn it over to the other.

Toast till the bread is golden brown. Put off the flame and serve hot!

 

Advertisements

గోధుమ పుట్నాల పాయసం /Milk dips for children

ఇంతకు ముందు గోధుమ బిస్కట్లు తయారు చేయడం చూసారు కదా. వాటితో పిల్లలకి మంచి బలవర్ధకరమైన పాయసం చెయడం చుద్దాం.

milk dips
milk dips

కావలసినవి:
కాచిన పాలు ఒక గ్లాసు
పుట్నాలు ఒక కప్పు
పంచదార అర కప్పు
తురిమిన పచ్చి కొబ్బరి పావు కప్పు
గోధుమ బిస్కట్లు గుప్పెడు

విధానం:
పుట్నాలు, పంచదార, పచ్చి కొబ్బరి తురుము మూడింటిని కలిపి మిక్సీ లో వేసి పొడి చేసుకొండి. ఒక వెడల్పాటి గిన్నెలో మరిగిన పాలు తీసుకుని, ఈ పొడిని వేసి బాగ కలిపి మూడు నిముషాలు పొయ్యి మీద పెట్టి వుడికించండి. ఇష్టమున్న వాళ్ళు ఒక చెంచా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వెసుకోవచ్చు కూడా. ఇప్పుదు ఈ మిశ్రమాన్ని చల్లార్చి గోధుమ బిస్కట్లు వేసి కలిపి ఫ్రిజ్ లో పెట్టండి. చల్లరాక సెర్వ్ చెయ్యండి.

 

Here’s a different sweet recipe for kids and for special occasions!

Grind a cup of roasted dal, half cup sugar and half cup fresh grated coconut in a mixer. Keep aside.

Boil a big glass of milk in a pan. Add the above mixture and stir in and boil for three minutes. You may add a spoon of clarified butter and roasted dryfruits to enhance the flavor.

Switch off the flame. Let it cool. Add a handful of wheat cracklers to it. Mix well and put it in fridge. Serve chilled!

మినపప్పు గారెలు/ Andhra gaarelu-Highly protein rich vegetarian recipe

మినపప్పు గారెలు

గారెలు లేని తెలుగు పండగ సంబరాలని ఊహించుకోగలమా. మెత్తగా నోట్లో వేస్కుంటే కరిగిపొయేలాంటి గారెలు ఎలా చేయాలో చూద్దాం.

gaarelu
gaarelu

కావల్సినవి:
మినప్పప్పు- 2కప్పులు
తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
తరిగిన అల్లం రెండు చెంచాలు
పచ్చిమిరపకాయలు ఐదు (నూరాలి)
నూనె వెయించడానికి సరిపడా
ఉప్పు తగినంత
తరిగిన కరివేపాకు, కొత్తిమీర గుప్పెడు

పద్ధతి :

మినప్పప్పు ఆరు గంటలు నానబెట్టాలి. తరువాత నీరు వంపేసి మిక్సీ లో వేసి మెత్తగా
గ్రైండ్ చేసుకోండి. వీలైనంత వరకు నీరు పొయకుండా గ్రైండ్ చేయండి. మరీ కుదరకపొతె 2 చెంచాలు కలిపి మెత్తగా పిండి పట్టండి. నీరు పోస్తే గారె నూనె యెక్కువ పీల్చుకుంటుంది. పైగా గుండ్రంగా రావు.
ఇప్పుడు పిండిని ఒక గిన్నెలొకి తీసుకుని అందులొకి ఉప్పు, దంచిన అల్లం, నూరిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివెపాకు వెస్కొని బాగ కలపండి.
బాణలి లొ నూనె పొసి పొయ్యి వెలిగించండి. ఒక పాల కవర్ తీసుకొని కొంచెం తడి చేసి,చెయ్యి తడిచేసుకుని పిండి కొంచెం కొంచెం తీసుకుని కవర్ మీద గుండ్రంగా చేత్తో వొత్తుకోవాలి. మధ్యలో చిన్న రంధ్రం చెయ్యండి. అలా ఐన గారెని మెల్లగా చెతిలొకి తీస్కుని నూనెలోకి నిదానంగా జారవిడవండి.

రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు వెయించి తీయండి. ఇలానె అన్ని గారెలు చేస్కోవాలి. అల్లం పచ్చడి తో గాని టమాటో పచ్చడి కాని వడ్డించారంతే అంతే, యెన్ని తింటామో లెక్క ఉండదు.

 

Andhra special gaareylu:

Highly protein rich and a must item for Telugu festival celebrations!

Ingredients:

Black gram 2 cups (soak for 6 hours)

Chopped onions – 1 cup

Green chillies 5 (grind them)

Ginger 2 spoons (paste it)

salt to taste

Oil for deep fry

Chopped curry leaves and coriander handful

Procedure:

In a grinder, make a thick paste of soaked black gram by adding no/minimal water.

Transfer into a bowl, add salt, onions, chillies, ginger paste, coriander and curry leaves. Mix well.

Heat oil in a pan, take small quantities of the above paste on a plastic cover. Make it into a thick round surface using your palm. This is the gaarey.

Make a hole in between for the gaarey thus obtained. Slowly take that into your hand and drop slowly into the oil. Deep fry till golden brown is seen on both sides.

Repeat the procedure for all the remaining paste.

Transfer into a kitchen cloth to remove excess oil.

Serve hot with tomato chutney!

 

అరటిపండు అమృతం/ Banana delight- 5 minute healthy breakfast recipe

అరటిపండు అమృతం

పిల్లలు పొద్దున్నే టిఫిన్ తినట్లేదని బాధపడుతున్నారా? ఆఫీసుకి వెళ్ళే హడవుడిలొ మీకు టిఫిన్ చేసే టైం దొరకట్లేదా? ఈ అరటిపండు అమృతం చేస్కొని తాగెసేయండి. లంచ్ టైం వరకు కావలసిన శక్తి వస్తుంది. ఐదు నిముషాలలొ తయారు అయిపోతుంది కూడా.

banana delight
banana delight

కావలసినవి:
అరటిపండ్లు రెండు
తియ్యటి పెరుగు రెండు కప్పులు
తేనె 4 చెంచాలు
పంచదార 2 చెంచాలు
నీరు రెండు గ్లాసులు
ఇలాచి పొడి అర చెంచా

విధానం:
మిక్సీ లో నీరు తప్ప మిగతావన్ని వేసి బాగ కలిసే వరకు తిప్పండి. ఇప్పుడు నీరు పొసి మళ్ళీ తిప్పండి. గ్లాసుల్లోకి తీసుకుని అందివ్వండి. కావాలనుకుంటే పది నిముషాలు ఫ్రిడ్జ్ లో కూడా వుంచుకుని తాగవచ్చు. వొపిక ఉన్నవారు నానబెట్టిన బాదం పప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ కుడా వేసుకోవచ్చు. మంచి బలవర్ధకరమైన పానీయం ఇది! ఇది ఇద్దరికి సరిపొతుంది. ఇంకా యెక్కువ కావాలంటే తగిన విధంగా పాళ్ళు పెంచుకోండి!

 

A healthy and 5 minute breakfast recipe to boost your energy levels for the day ahead!

Required:

Bananas two

Whole Curd 2 cups

Honey 4 spoons

Sugar 2 spoons

Water 2 glasses

Cardamom powder half spoon

Method:

In a blender, blend all ingredients except water till very smooth. Add water and blend for a minute. Take in a serving glass and drink! You can also serve it chilled. Soaked almonds, raisins, cherries may also be added if desired. This portion serves two. Contains good protein and carbohydrates to start your day!

మసాలా మరమరాలు/ Spicy Puffed Rice- Best snack for weight loss

మసాలా మరమరాలు

ఇవి చాలా ఆరోగ్యకరమైన సాయంకాలపు ఫలహారం. అస్తమానం నూనెలో వేగినవి కాకుండా పిల్లలకి ఇలాంటివి తినిపించారంటే బలానికి బలం కూడా వస్తుంది.బరువు తగ్గాలి అనుకునె వారికి మంచి స్నాక్ ఇది!

masala borugulu
masala borugulu/low calorie crispy recipe

కావలసినవి:

మరమరాలు 2 కప్పులు
పల్లీలు అర కప్పు
పుట్నాలు అర కప్పు
కరివేపాకు 2 రెమ్మలు
వెల్లుల్లి 3 భాగాలు
ఎండుమిరపకాయలు 4
పసుపు అర చెంచా
ఉప్పు తగినంత
నూనె ఒక చెంచా
తయారీ విధానం

మూకుడులో నూనె వేడి చెయ్యాలి. అందులో ముందు పల్లీలు వేసి అవి రంగు మారెంతవరకు వేయించాలి. తరువాత కరివేపాకు, దంచిన వెల్లుల్లి, పుట్నాలు, పసుపు, ఎండుమిర్చి వెసి రెండు నిమిషాల పాటు వేయించాలి.నచ్చిన వాళ్ళు ఇంగువ కుడా వెసుకొవచ్చు.మంచి వాసన వస్తుంది. పొయ్యి ఆపేసి పెద్ద గిన్నెలొకి వీటిని తీసుకుని మరమరాలు కూడ వేసి అన్ని బాగ కలిసేలా ఉప్పు జల్లి బాగా కలపాలి. గాలి జొరబడని డబ్బా లో పొసుకుంటే వారం పాటు కరకరలాడుతూ కారం కారం గా బావుంటాయి!

 

Best alternative for chips and rich in iron and protein!

Required:

Puffed rice 2 cups

Peanuts half cup

Roasted chana dal half cup

Turmeric half spoon

Salt to taste

Oil one spoon

Curry leaves

Red chillies 3

Procedure:

In a pan, heat the oil and fry peanuts till they change the color. Later add all other ingredients except puffed rice and fry for two minutes on low flame. Switch off the flame and in a bowl, transfer the fried contents and add puffed rice. Sprinkle required salt and mix thoroughly. Store in an air tight container. They stay fresh and crispy for a week. Enjoy with tea in the evening!

మైదా చేగొడీలు/బిస్కట్లు Home made cracklers

chegodilu

మైదా చేగొడీలు/బిస్కట్లు

సాయంత్రం పిల్లలు ఇంటికి రాగానే పెట్టడానికి కమ్మగా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రొజులు ఇబ్బంది ఉందదు. చేయడం కూడా తేలికే. మరి చెసి విధానం చూసేద్దామా.

కావలసినవి:
మైదా పావు కిలో
నూనె లేదా నెయ్యి అర కప్పు
జీలకర్ర రెండు చెంచాలు
ఉప్పు కారం తగినంత
నీరు కలుపుకొవడానికి కావల్సినంత

నూనె వేపుకొవడానికి తగినంత

తయారీ విధానం:
ముందుగా నూనె/నెయ్యి వేడి చేసి మైదా పిండిలొ పోసుకొవాలి.
తర్వాత అందులొ జీలకర్రా, ఉప్పు, కారం వేసుకొని బాగా కలపాలి.
ఇప్పుడు నీరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండి లాగ కలుపుకోవాలి.

చేగొడిలు చేసుకొవాలంటె:
చిన్న చిన్న గుండుల్లాగా పిండి ని తీస్కుంటు వాటిని పాములాగ చేస్కుంటూ చెగొడిలాగ చుట్టుకొవాలి. వాటిని నూనెలొ బంగారు రంగు వచ్చే వరకు వెయించుకొవాలి.తీసి పేపర్ మీద వెస్కుంటే అదనంగా ఉన్న నూనె యెమైనా ఉంటే పీల్చేసుకుంటుంది.

బిస్కట్లు చేసుకొవాలంటే:
పిండి ని చపాతి ముద్దంత తీస్కుని చపాతి లాగ వొత్తుకొని చాకుతో నిలువుగా, తరువాత అడ్డంగా కోసుకొవాలి.డైమండ్ ఆకారం వస్తుంది కదా వాటిని పైన చెప్పినట్టె నూనెలొ వేపుకొవాలి.

పిల్లలకు నచ్చేట్టు:
చిన్న చిన్న పిండి ముద్దల్ని తీస్కుని పాములాగా చేత్తొ చెస్కుని వాటిని అక్షరాల ఆకరంలొ చెస్కుని వెయించుకొవచ్చు.

అదన్నమాట అంత మీ స్రుజన మీద ఆధారపడివుంది అంతే! మీరు యేవైనా కొత్తగా చేసి ఉంటే మాతో పంచుకోవడం మరవకండి.. 🙂

Follow us at facebook

 

Maida Biscuits:

They will stay for up to one week and will be very handy if there are children in home.

 

Ingredients:

Maida/ All purpose flour: 1/4kg

Oil/ghee:  half cup

Oil for deep fry

cumin seeds- 2 tbsp

salt and chilli powder as per taste

 

Procedure:

Heat half cup oil.ghee and pour into maida.

Add cumin, salt, chilli powder and mix thoroughly.

Now slowly add water and mix till a dough is formed.

Take small pebbles of dough and roll like a snake and make small circular pieces.

Alternately you can even roll it like a roti or chapati, and cut it into diamond shapes or any other shapes you wish.

Fry these pieces in oil and place them over tissue paper for a while.

They will stay fresh for a week and will be very crunchy!!

Follow us at facebook